ABOUT NASHKAL.
Mandal Name : Ghanpur(station)
District : Warangal
State : Telangana
Region : Telangana
Language : Telugu and Urdu
Time zone: IST (UTC+5:30)
Elevation / Altitude: 344 meters. Above Seal level
Telephone Code / Std Code: 08711
Pin Code : 506144
Post Office Name : Abadighanpur.
Nashkal is a Village in Ghanpur(station) Mandal in Warangal District of Telangana State, India. It belongs to Telangana region . It is located 19 KM towards west from District head quarters Warangal. 11 KM from Ghanpur (Stn).
India is the country of villages; people of this nation majorly reside in the interior part of it that mainly comprises of villages or rural human settlements, it is estimated that about 68.84% of the Indian population stays in villages. It has been well said by M.K. Gandhi that “The soul of India lives in its villages”, most of these villages have their own temples, churches and mosques. Most of the villages in India are packed with greenery cattle around due to its dependence on agriculture for their living. These human settlements are often large in area with Eco-friendly habitat contributing to the simple lifestyle lead by the inhabitants.
Nashkal is a village in the state of Andhra Pradesh; it lies in Ghanpur (station) block/taluka/tehseel. The village is located in Warangal district with a total population of , of which are men and the female population comprises of
There are satellite maps available on this website for villages you wants to look out for; these maps can help you to locate various villages and distinct locations within them or the boundaries shared by the particular Nashkal village with other human settlements nearby. This makes it easier for the viewer to locate things and regions around thus increasing the accessibility even in the rural areas of Nashkal.
PHOTOS OF NASHKAL
SRI SEETHARAMA TEMPLE AND SRI RAMA NAVAMI.
శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణా లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’ గా విశేషంగా జరుపుకుంటాం.
ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు












